![]() |
![]() |
.webp)
అష్షు రెడ్డి బుల్లితెర మీద ఈవెంట్స్, షోస్ చేస్తూ మంచిగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. అలాంటి అష్షుకి దైవ భక్తి కొంచెం ఎక్కువే..సందర్భం ఉందా లేదా అని పక్కనపెడితే వేణు స్వామితో పూజలు చేయించుకుంటూ ఉంటుంది. ఆయన ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటుంది. టైం దొరికితే టెంపుల్స్ కి వెళ్తూ ఉంటుంది. అలాంటి అష్షు ఇప్పుడు ఉజ్జయిని వెళ్ళింది. అక్కడ తెల్లవారు జామునే ఉజ్జయిని మహాకాళేశ్వరుడిని దర్శించుకుంది. ఆయన భస్మ హారతి కోసం భక్తులు వెళ్తూ ఉంటారు. అష్షు కూడా వెళ్లి దర్శించుకుంది. శివుడు ఇక్కడ కాల దేవుడిగా పూజలందుకుంటాడు.
శివరాత్రి వస్తున్న సందర్భంలో ఈ ఆలయంలోని శివుడిని భక్తులు ఎక్కువగా దర్శించుకోవడానికి వస్తారు. ఇప్పుడు అష్షు కూడా వెళ్లి ఆ స్వామిని దర్శించుకుని తన మనసులో ఉన్న కోరికలన్నీ తీరాలని వేడుకుంది. ఆయన సేవలో తరించి వచ్చింది. అష్షు వీకెండ్స్ వచ్చాయంటే చాలు హాట్ పిక్స్ తో ఫాన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. అలాగే ఎప్పుడూ ఫుల్ జోష్ గా మంచి హాట్ స్ట్రక్చర్ ఉండడం కోసం రెగ్యులర్ గా వర్కౌట్స్ చేస్తూ ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు పులి చర్మాల డ్రెస్సులు వేసుకుని ఫ్రెండ్స్ తో ఫుల్ ట్రెండింగ్ రీల్స్ కి డాన్స్ చేస్తూ ఉంటుంది. ఇక అష్షుకి ఎక్స్ప్రెస్ హరి, రాహుల్ సిప్లిగంజ్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. అష్షు, రాహుల్ ఇద్దరూ బిగ్ బాస్ 3 లో సందడి చేశారు. అలాంటి రాహుల్ తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టాడు. అష్షు రెడ్డితో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేస్తూ..”ఎప్పుడు నా బెస్ట్ ” అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. టిక్ టాక్ వీడియోస్ తో కెరీర్ స్టార్ట్ చేసిన అష్షు బిగ్ బాస్ వరకూ ఎదిగింది అష్షు రెడ్డి. రెండు సార్లు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టింది..కానీ ఫైనల్ వరకూ కూడా వెళ్లలేకపోయింది ఈ అమ్మడు. ప్రస్తుతం వరుసగా ప్రోగ్రామ్స్ చేస్తూ ఫుల్ ఫార్మ్ లో ఉంది. ఇక ఏ మాస్టర్ పీస్ అనే మూవీలో కూడా నటించింది అష్షు.
![]() |
![]() |